Delhi: ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద భద్రత పెంపు

ఢిల్లీ పోలీసులు దౌత్య కార్యాలయం వద్ద, సమీపంలో పెట్రోలింగ్‌ను పెంచారు.

Update: 2024-10-02 19:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద భద్రతను పెంచినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు బుధవారం ప్రకటనలో తెలిపాయి. అలాగే, దౌత్య కార్యాలయం వద్ద, సమీపంలో పెట్రోలింగ్‌ను పెంచినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. బృందాలు అనుక్షణం భవనం వద్ద మోహరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనా గ్రూపు ఆకస్మిక దాడి తర్వాత గాజాలో హమాస్‌తో ఇజ్రాయెల్ యుద్ధానికి దిగిన సమయంలోనూ ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో భద్రతను పెంచారు. ఆగస్టులోనూ హమాస్ నేత ఇస్మాయిల్ హనియెహ్ టెహ్రాన్‌లోని అతని నివాసంలో హత్యకు గురైన తర్వాత ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి హెచ్చరికలు అందుకున్న ఢిల్లీ పోలీసులు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంతో పాటు చాబాద్ హౌస్ వద్ద భద్రతను సమీక్షించారు. అంతకుముందు 2021, 2023లలో దౌత్యకార్యాలయం సమీపంలో రెండుసార్లు అనుమానిత ఐఈడీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాగా, ఇరాన్ మంగళవారం ఇజ్రాయెల్‌పై 181 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి.

Tags:    

Similar News