Ranveer Allahbadia:పోలీసులకు సహకరిస్తున్నా.. విమర్శలపై స్పందించిన యూట్యూబర్

తల్లిదండ్రుల గురించి, శృంగారం పైన ప్రశ్నించి వివాదాల్లో చిక్కుకున్న ప్రముఖ యూట్యూబర్‌ రణ్ వీర్‌ అల్హాబాదియా(Ranveer Allahbadia) పరిస్థితి అధ్వాన్నంగా మారింది.

Update: 2025-02-15 17:41 GMT
Ranveer Allahbadia:పోలీసులకు సహకరిస్తున్నా.. విమర్శలపై స్పందించిన యూట్యూబర్
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: తల్లిదండ్రుల గురించి, శృంగారం పైన ప్రశ్నించి వివాదాల్లో చిక్కుకున్న ప్రముఖ యూట్యూబర్‌ రణ్ వీర్‌ అల్హాబాదియా(Ranveer Allahbadia) పరిస్థితి అధ్వాన్నంగా మారింది. అయితే, అల్హాబాదియా పోలీసులకు దొరక్కుండా తప్పించుకుపోతున్నాడని వదంతలు వస్తున్నాయి. అతడి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడని రూమర్లు చెలరేగాయి. దీంతో, ఈ పుకార్లపై అతడు సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. ‘నేను, నా టీమ్‌ పోలీసులకు సహకరిస్తున్నాం. వారికి నేను అందుబాటులోనే ఉన్నాను. తల్లిదండ్రులపై అనుచిత వ్యాఖ్యలు చేశాను, వారిని అవమానించాను. అందుకు నన్ను క్షమించండి. ఈ విషయంలో నేను కాస్త బాధ్యతగా వ్యవహరించాల్సింది. నా తల్లి క్లినిక్‌పై దాడి చేస్తున్నారు. చాలామంది నన్ను చంపుతానని బెదిరిస్తున్నారు. నాతో సహా నా కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. కొందరైతే రోగులుగా నటిస్తూ మా అమ్మగారి క్లినిక్‌కు వెళ్లి అక్కడ విధ్వంసం సృష్టించారు. నాకు చాలా భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. కానీ నేను ఎక్కడికీ పారిపోవడం లేదు. పోలీసులపై, భారత న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది’ అని రణ్‌వీర్‌ రాసుకొచ్చాడు.

అసలేం జరిగిందంటే?

రణ్‌వీర్ అల్హబాదియా.. కమెడియన్‌ సమయ్‌ రైనా నిర్వహించిన ‘ఇండియాస్ గాట్ లేటెంట్ షో (India’s got latent show)’ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కంటెంట్ క్రియేటర్లు ఆశిష్ చంచ్లానీ, జస్ప్రీత్ సింగ్, అపూర్వ ముఖిజాలతోపాటు షోలో పాల్గొన్న ఆయన ఆ షోలో పాల్గొన్నాడు. ‘తల్లిదండ్రులు శృంగారంలో పాల్గొనడాన్ని నువ్వు జీవితాంతం చూస్తావా..? లేదంటే ఒకసారి చూస్తే ఆపై చూడకుండా ఉంటావా..?’ అని ఒక కంటెస్టెంట్‌ను అతడు ప్రశ్నించాడు. కాగా.. ఈ ప్రశ్నపై సర్వత్రా ఆగ్రహం వెల్లువెత్తింది.

Tags:    

Similar News