Parliament: పార్లమెంటు సభ్యుల జీతాల పెంపు.. ఎంపీకి నెల జీతం ఎంతంటే?

పార్లమెంటు సభ్యులు, మాజీ సభ్యుల జీతభత్యాలు పెంచుతున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. సవరించిన జీతభత్యాలు, పెన్షన్ పెంపు ఏప్రిల్ 1, 2023 నుంచి అమల్లోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది.

Update: 2025-03-24 10:52 GMT
Parliament: పార్లమెంటు సభ్యుల జీతాల పెంపు.. ఎంపీకి నెల జీతం ఎంతంటే?
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటు సభ్యులు, మాజీ సభ్యుల జీతభత్యాలు పెంచుతున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. సవరించిన జీతభత్యాలు, పెన్షన్ పెంపు ఏప్రిల్ 1, 2023 నుంచి అమల్లోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. పార్లమెంటు సభ్యుల జీతభత్యాలు, పెన్షన్ చట్టం- 1954 ద్వారా మంజూరు చేసిన అధికారాల ద్వారా ఈ చర్య తీసుకున్నారు. ఆదాయపు పన్ను చట్టం- 1961లోని వ్యయ ద్రవ్యోల్బణ సూచికపై జీతభత్యాల పెంపు ఆధారపడి ఉంది. ఇకపోతే, పార్లమెంటు సభ్యుల నెలవారీ జీతం రూ.1,00,000 నుండి రూ.1,24,000 కు పెరిగింది. రోజువారీ భత్యం రూ.2,000 నుండి రూ.2,500 కు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. పార్లమెంటు సభ్యులు, మాజీ సభ్యుల నెలవారీ పెన్షన్ రూ.25,000 నుండి రూ.31,000 కు సవరించింది. మాజీ సభ్యులకు ప్రతి సంవత్సరం సర్వీస్‌కు అదనపు పెన్షన్ రూ. 2,000 నుండి రూ. 2,500 కు పెరిగింది. కాగా.. కర్ణాటక ప్రభుత్వం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలకు వందశాతం జీతాల పెంపును ఆమోదించిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఇది అసెంబ్లీలో తీవ్ర చర్చకు దారితీసింది.

Tags:    

Similar News