‘స్వలింగ వివాహాలకు చట్టబద్ధత’పై రేపు తుది తీర్పు..

స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించనుంది.

Update: 2023-10-16 15:12 GMT

న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించనుంది. అంతకుముందు ఈ పిటిషన్లపై వాదోపవాదనలు జరిగిన అనంతరం సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. గత మే నెలలో తీర్పును రిజర్వులో పెట్టిన విషయం తెలిసిందే.

వాదనల సందర్భంగా స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ ఢిల్లీ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (డీసీపీసీఆర్) సహా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించగా, పిటిషన్లను కేంద్ర ప్రభుత్వంతోపాటు జాతీయ బాలల హక్కుల సంఘం ఎన్‌సీపీసీఆర్, జమియత్-ఉలమా-ఇ-హింద్ ఇస్లామిక్ పండితుల సంఘం వ్యతిరేకించాయి.


Similar News