ఆప్‌ నేత సత్యేందర్‌ జైన్‌కు సుప్రీంకోర్టులో ఊరట..

మనీలాండరింగ్‌ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఢిల్లీ ఆప్‌ నేత సత్యేందర్‌ జైన్‌‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

Update: 2023-08-25 12:04 GMT

న్యూఢిల్లీ : మనీలాండరింగ్‌ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఢిల్లీ ఆప్‌ నేత సత్యేందర్‌ జైన్‌‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వైద్య కారణాలతో ఆయనకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌‌ను సెప్టెంబర్‌ 1వరకు పొడిగిస్తూ ఎఎస్‌ బోపన్నా, ఎం.ఎం సుందరేష్‌లతో కూడిన సుప్రీం బెంచ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. జైన్‌ ఆరోగ్య పరిస్థితి గురించి సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి కోర్టు కు వివరించారు. సత్యేందర్‌కు జులై 21న సర్జరీ జరిగిందని, ఆయనకు తీవ్ర అనారోగ్య సమస్యలున్నాయని.. ఫిజియోథెరపీ చేయించుకోవాల్సిన అవసరం ఉందని కోర్టుకు తెలిపారు. దీంతో సత్యేందర్‌ జైన్‌‌కు మధ్యంతర బెయిల్‌ను సుప్రీం పొడిగించింది.


Similar News