Salman Khan murder plot:బాలీవుడ్ నటుడు సల్మాన్ హత్య కుట్ర కేసులో మరొకరు అరెస్ట్

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర పన్నిన కేసులో మరొకరు అరెస్టు అయ్యారు.

Update: 2024-10-17 05:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర పన్నిన కేసులో మరొకరు అరెస్టు అయ్యారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు సుఖాను హర్యానాలోని పానిపట్ లో అదుపులోకి తీసుకున్నారు. గురువారం నిందితుడ్ని కోర్టు ముందు ప్రవేశపెడతామని నవీ ముంబై పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 14న సల్మాన్‌ (Salman Khan) ఇంటివద్ద కాల్పులు జరిగాయి. ముంబై బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్ మెంట్స్ వద్దకు మోటార్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి అక్కడ్నుంచి పరారయ్యారు. ఆ కేసు దర్యాప్తు జరుగుతుండగా.. జూన్ లో మరోసారి సల్మాన్ హత్యకు కుట్ర జరిగింది. పన్వేల్ ఫామ్‌హౌస్‌కు దగ్గర్లోని ఇంటికి వెళ్తున్న మార్గంలో సల్మాన్ పై దాడి చేయాలని ప్లాన్‌ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఆ కేసులో భాగంగానే ఈ అరెస్టు జరిగింది. కాల్పుల ఘటనపై సల్మాన్‌ఖాన్‌ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. తనను, తన కుటుంబసభ్యులను చంపే ఉద్దేశంతోనే లారెన్స్‌ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు జరిపిందని నమ్ముతున్నట్లు వెల్లడించారు

350 పేజీల ఛార్జిషీటు

ఇక ఈ కేసు దర్యాప్తు జరిగేకొద్దీ వాస్తవాలు బయటపడ్డాయి. నవీ ముంబయి పోలీసులు దాఖలు చేసిన 350 పేజీల ఛార్జిషీట్‌లో కీలక అంశాలు ప్రస్తావించారు. సల్మాన్‌ హత్యకు బిష్ణోయ్ గ్యాంగ్‌ పక్కా ప్లానింగ్‌తో వ్యవహరిస్తోందని తెలిపారు. పంజాబీ సింగర్‌ సిద్ధూమూసేవాలా హత్య తరహాలోనే కారులో హత్య చేయాలని నిర్ణయించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం మైనర్లను షార్పు షూటర్లుగా వాడేందుకు గ్యాంగ్‌ ఏర్పాట్లు చేసిందన్నారు. సినిమా షూటింగ్‌లు లేదా పన్వేల్‌ ఫామ్‌హౌస్‌కు సల్మాన్‌ రాకపోకలు సాగిస్తున్న టైంలో హత్య పన్నాలని అమలు చేయాలనుకున్నట్లు తెలిపారు. సల్మాన్ హత్యకు రూ.25 లక్షల కాంట్రాక్టు కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు.


Similar News