UGC-NET: యూజీసీ-నెట్ రీ-ఎగ్జామ్‌ను సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

దానివల్ల అనిశ్చితి, పూర్తి గందరగోళానికి దారితీస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది.

Update: 2024-08-12 14:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పేపర్ లీక్‌ల కారణంగా యూజీసీ-నెట్ 2024 పరీక్షను మళ్లీ నిర్వహించాలన్న కేంద్రం నిర్ణయాన్ని రద్దు చేయాలనే అంశంపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. దానివల్ల అనిశ్చితి, పూర్తి గందరగోళానికి దారితీస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆగస్టు 21వ తేదీన పరీక్షను మళ్లీ నిర్వహించాలని సూచించింది. 'పరీక్ష జూన్ 18న నిర్వహించారు. ఆ తర్వాత జూన్ 19న పరీక్ష రద్దు చేశారు. ఇప్పుడు ఆగస్టు 21న పరీక్ష జరగాల్సి ఉంది. పరీక్ష రద్దు చేయాలని పిటిషన్ వేశారు. ఇప్పటికే రెండు నెలలు గడిచిపోయాయి. ప్రస్తుత దశలో రద్దు పిటిషన్‌ను అనుమతించడం పూర్తిగా గందరగోళానికి కారణమవుతుందని' అని బెంచ్ అభిప్రాయపడింది. ఆగస్టు 21న తొమ్మిది లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారని, ఈ చివరి దశలో రద్దును సవాలు చేయలేమని బెంచ్ స్పష్టం చేసింది.  

Tags:    

Similar News