ఆ నిర్ణయంతో కేరళ ప్రభుత్వానికి రూ.1000 కోట్ల నష్టం
కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీసుకున్న ఓ నిర్ణయం వల్ల ఆ రాష్ట్రానికి రూ.1000 కోట్ల నష్టం వాటిల్లింది.
దిశ, వెబ్ డెస్క్ : కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీసుకున్న ఓ నిర్ణయం వల్ల ఆ రాష్ట్రానికి రూ.1000 కోట్ల నష్టం వాటిల్లింది. ఇంతకీ ఏం జరిగిందో వివరాల్లోకి వెళితే.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ మందుల దుకాణంలోనూ యాంటీ బయోటిక్స్ మెడిసిన్స్ అమ్మకూడదంటూ కేరళ ప్రభుత్వం గతేడాది ఓ జీవో విడుదల చేసింది. చేయడమే కాదు అది పక్కాగా అమలయ్యేలా గట్టి చర్యలు కూడా తీసుకుంది. దాని ఫలితంగా ఎక్కడిక్కడ అనవసర మందుల అమ్మకం తగ్గిపోయింది. దాని ఫలితంగా రాష్ట్రంలో మందుల అమ్మకంలో ఏకంగా వెయ్యి కోట్ల నష్టం వచ్చిందని సమాచారం. అయితే ప్రతి ఏడాది కేరళలో రూ.15000 కోట్ల మందులు అమ్ముడవుతుండగా.. దానిలో యాంటీ బయోటిక్స్ మందులే దాదాపు రూ.5 వేల కోట్ల అమ్మకాలు సాగుతుండేవి. ఎవరికి వారే సొంత వైద్యం పాటిస్తూ, ఇష్టారీతిన యాంటీ బయోటిక్స్ వాడుతూ కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారని ప్రభుత్వం దృష్టికి రాగా.. కేరళ ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుంది. దీనివల్ల మందుల కంపెనీలు కినుక వహించినా.. ప్రజలకు మాత్రం మంచే జరిగిందని చర్చ నడుస్తోంది.