కులాంతర వివాహం చేసుకుంటే రూ.10 లక్షలు గిఫ్ట్ మనీ..

కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2023-03-24 14:04 GMT

దిశ, వెబ్ డెస్క్ : కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కులాంతర వివాహం చేసుకునే వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని రెట్టింపు చేసింది. కులాంతర వివాహం చేసుకుంటే చాలు వారి బ్యాంకు ఖాతాల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జమచేయనుంది.

ఈ విషయాన్ని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ 2023 - 24 బడ్జెట్ సమావేశంలో ప్రకటించగా తాజాగా నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఎవరైతే కులాంతర వివాహం చేసుకుంటారో ఆ జంటపేరుపై ప్రభుత్వం రూ.5 లక్షలను ఎనిమిదేళ్ల పాటు ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తుందట. మిగిలిన రూ.5 లక్షలను కొత్తజంట ఉమ్మడి బ్యాంకు ఖాతాలో జమచేయనున్నారు. 

Tags:    

Similar News