Modi : ప్రధాని మోడీపై రాబర్టు వాద్రా విమర్శలు

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా(Robert Vadra )క్రిస్‌మస్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Modi)పై తీవ్ర విమర్శలు చేశారు

Update: 2024-12-25 09:44 GMT

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా(Robert Vadra )క్రిస్‌మస్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Modi)పై తీవ్ర విమర్శలు చేశారు. మోడీ పాలనలో మత విశ్వాసాలను అనుసరించడంలో దేశంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రజల్లో స్వంత మతాలు, విశ్వాసాలను విశ్వసించే స్వేచ్ఛ లేదన్న అసహనం ప్రజల్లో కనిపిస్తుందన్నారు. ప్రజలు తమ ఇళ్లలో ఇబ్బందులు పడినప్పుడు, వారు ప్రార్థన చేయాలనుకుంటారని, వారు ఏ మంత్రుల గురించి, రాజకీయ నాయకుల గురించి ఆలోచించరన్నారు.

దేవుళ్ళను ప్రార్థిస్తే వారి కష్టాలు తగ్గుతాయని ప్రజలు భావిస్తారన్నారు. అది పాలకులకు ఇష్టం లేనట్లుగా ఉందన్నారు. మన దేశం సెక్యులర్‌గా ఉండాలని కోరుకుంటున్నామని, అప్పుడే దేశంలో శాంతి, సామరస్యాన్ని చూస్తామన్నారు.

Tags:    

Similar News