‘కేరళలో అమలు చేయం’.. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం
కేరళ అసెంబ్లీ(Kerala Assembly)లో వక్ఫ్ బోర్డు(Waqf Board) సవరణ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. చర్చల అనంతరం వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: కేరళ అసెంబ్లీ(Kerala Assembly)లో వక్ఫ్ బోర్డు(Waqf Board) సవరణ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. చర్చల అనంతరం వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును అమలు చేయబోమని సీఎం పినరయి విజయన్(CM Pinarayi Vijayan) స్పష్టం చేశారు. కాగా, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా 1954లో ఈ వక్ఫ్ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత పలుమార్లు.. ప్రభుత్వం ఆ వక్ఫ్ చట్టాన్ని సవరించింది.
ఇందులో భాగంగానే 1995లో ఈ వక్ఫ్ చట్టాన్ని తొలిసారి సవరించిన సర్కార్.. మరిన్ని అధికారాలను కట్టబెట్టింది. ఆ తర్వాత 2013లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ-2 ప్రభుత్వం మరోసారి సవరణలు చేసింది. ఈ వక్ఫ్ చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం.. వక్ఫ్ బోర్డులకు విశేష అధికారాలను కల్పించారు. ఈ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టుల్లోనూ సవాల్ చేయలేని విధంగా.. ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునే విధంగా ప్రత్యేక అధికారాలు కల్పించారు. ప్రస్తుతం దేశంలో 30 వరకు వక్ఫ్ బోర్డులు ఉన్నాయి.