Odisha train accident: రెస్క్యూ ఆపరేషన్ పూర్తి.. పునరుద్దరణ పనులు ప్రారంభం: రైల్వే మంత్రి
ఒడిశా కోరమాండల్ రైలు ప్రమాదం మొత్తం భారతదేశాన్ని దిగ్ఘ్రాంతికి గురిచేసింది. శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో జరిగిన ఈ మూడు రైళ్ల ప్రమాదంలో ఇప్పటి వరకు మొత్తం 280 మంది చనిపోగా.. 900 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
దిశ, వెబ్‌డెస్క్: ఒడిశా కోరమాండల్ రైలు ప్రమాదం మొత్తం భారతదేశాన్ని దిగ్ఘ్రాంతికి గురిచేసింది. శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో జరిగిన ఈ మూడు రైళ్ల ప్రమాదంలో ఇప్పటి వరకు మొత్తం 280 మంది చనిపోగా.. 900 మంది ప్రయాణికులు గాయపడ్డారు.మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే సంఘటన స్థలాన్ని పరిశీలించిన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అయిందని.. మొత్తం క్షతగాత్రులను బయటకు చేసినట్లు తెలిపారు. అలాగే ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. అలాగే ఈ విషాద సంఘటన పై సమగ్ర విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.
Also Read..
Coromandel express accident :కోరమండల్ రైలు ప్రమాదం ఎలా జరిగిందంటే..?