పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్స్.. హర్యాణాలో ఆ పార్టీదే అధికారం

హర్యాణాలో అసెంబ్లీ ఎన్నికల(Assembly elections in Haryana) పోలింగ్‌ ముగిసింది. శనివారం ఉదయం 7 గంటలకు ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది.

Update: 2024-10-05 13:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: హర్యాణాలో అసెంబ్లీ ఎన్నికల(Assembly elections in Haryana) పోలింగ్‌ ముగిసింది. శనివారం ఉదయం 7 గంటలకు ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల నాటికి దాదాపు 61 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా.. హర్యాణాలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్(People's Pulse Exit Polls) విడుదల అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలకు ఎన్నికలు జరుగగా.. కాంగ్రెస్‌కు = 55, బీజేపీకి = 26, ఇతరులకు మూడు నుంచి ఐదు సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది. మరోవైపు ఈ ఎన్నికల్లో ఆప్, జేజేపీ, ఏఎస్‌పీ, ఐఎన్‌ఎల్‌డీ, బీఎస్‌పీ ప్రభావం ఏమాత్రం ఉండబోదని తెలుస్తోంది. మొత్తంగా కాంగ్రెస్‌కు 45 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Similar News