ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించిన బీజేపీ జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్

పార్లమెంట్ ఎన్నికల అనంతరం దేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. అలాగే ఈ రోజు హర్యానా అసెంబ్లీకి ఒకే విడతలో 90 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

Update: 2024-10-05 13:48 GMT

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ ఎన్నికల అనంతరం దేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. అలాగే ఈ రోజు హర్యానా అసెంబ్లీకి ఒకే విడతలో 90 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగియడంతో.. ఎగ్జిట్ పోల్స్(exit polls) విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ మొత్తం.. హర్యాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, జమ్మూ-కాశ్మీర్‌లో ఎన్సీ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తుందని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. కాగా ఈ ఎగ్జిట్ పోల్స్(exit polls) పై బీజేపీ జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్(BJP National Secretary Tarun Chugh) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "... ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కంటే మెరుగ్గా ఉంటాయి. హర్యానా, జమ్మూ కాశ్మీర్ రెండింటిలోనూ బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రజల ఆశీస్సులు బీజేపీ(BJP)కి ఉన్నాయి. ఆ రెండు రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడుతుంది" అని ధీమా వ్యక్తం చేశారు.


Similar News