చైనా బార్డర్ ఇష్యూపై చర్చించే ధైర్యం నాకుంది : Rajnath Singh

భారత్-చైనా బార్డర్ ఇష్యూపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం లోక్ సభలో వెల్లడించారు.

Update: 2023-09-21 10:28 GMT

న్యూఢిల్లీ : భారత్-చైనా బార్డర్ ఇష్యూపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం లోక్ సభలో వెల్లడించారు. ఆ అంశంపై సభలో చర్చించే పూర్తి ధైర్యం, విశ్వాసం తనకు ఉన్నాయని తేల్చి చెప్పారు. చంద్రయాన్-3 సహా అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూనే సరిహద్దు అంశాన్ని రక్షణ మంత్రి ప్రస్తావించారు. దేశ సరిహద్దుల్ని రక్షించుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. చైనా అంశాన్ని కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సభలో ప్రస్తావించడాన్ని గుర్తు చేస్తూ రాజ్ నాథ్ ఈ సమాధానమిచ్చారు. కాగా, దాదాపు రెండున్నరేళ్లుగా భారత్, చైనా మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదంపై వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.


Similar News