Exchange Rs 2000 : 2 వేల నోట్లు మార్చుకోని వారి ఆర్బీఐ గుడ్ న్యూస్
రూ.2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకోని వారికి ఆర్బీఐ మరో అవకాశాన్ని కల్పించింది. ఈ సంవత్సరం మే 19న నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది.
దిశ, వెబ్డెస్క్: రూ.2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకోని వారికి ఆర్బీఐ మరో అవకాశాన్ని కల్పించింది. ఈ సంవత్సరం మే 19న నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. దీనికి దాదాపు నాలుగు నెలల సమయం ఇచ్చిన ఆర్బీఐ అక్టోబర్ 30వ తేదీ వరకు చివరి అవకాశం కల్పించింది. కాగా ఈ రోజుతో ఆ గడువు ముగియనుండటంతో ఇంకా రెండు వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయని వారికి మరో అవకాశాన్ని కల్పించింది. రూ.2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శనివారం చివరి తేదీని పొడిగించి.. అక్టోబర్ 7 వరకు అవకాశం కల్పించింది. ఇంకా ఎవరి వద్దైన రూ 2 వేల నోట్లు ఉంటే.. బ్యాంకుల్లో అక్టోబర్ 7 వరకు జమ చేయాలని కోరింది.