Rape attempted: నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. ఉత్తరాఖండ్‌లో దారుణం

ఉత్తరాఖండ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై ముగ్గురు పాఠశాల విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు.

Update: 2024-09-08 13:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై ముగ్గురు పాఠశాల విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ నెల 3వ తేదీన జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారిని తన తల్లి ఎప్పటిలాగే ఉదయం 8గంటలకు స్కూల్‌కు పంపించింది. అనంతరం మూడు గంటల తర్వాత బాలిక ఏడుస్తూ ఇంటికి వచ్చింది. మరుసటి రోజు తన తల్లి కుమార్తెను మందలించగా..పాఠశాలలో అబ్బాయిలు కొట్టారని, అంతేగాక తన ప్రైవేట్ భాగాలలో నొప్పిగా ఉందని చెప్పింది. దీంతో బాలిక తల్లి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన కుమార్తెపై లైంగిక దాడి జరిగినట్టు ఆరోపించింది.

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి అదే పాఠశాలకు చెందిన 6 నుంచి 11ఏళ్ల వయసున్న ముగ్గురు విద్యార్థులను ఆదివారం అరెస్ట్ చేశారు. వారిని జువైనల్ హోంకు తరలించారు. ఈ ఘటనను చట్టపరంగా లైంగిక దాడి యత్నంగా పేర్కొంటామని ఉధమ్ సింగ్ నగర్ పోలీస్ సూపరింటెండెంట్ మనోజ్ కత్యాల్ తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. పాఠశాల ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేసింది. ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వెలుగులోకి రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. 


Similar News