అణ్వాయుధాల కంటే డేంజర్ ఇవీ.. కేంద్రమంత్రి జై శంకర్
కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్(Jai Shankar) ఆర్టిఫీషియల్ ఇంటిలిజన్స్(AI) మీద కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్(Jai Shankar) ఆర్టిఫీషియల్ ఇంటిలిజన్స్(AI) మీద కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన 'కౌటిల్య ఎకనామిక్ సదస్సు' (Kautilya Economic Conclave)లో పాల్గొన్న కేంద్రమంత్రి.. రాబోయే దశాబ్ద కాలంలో ఏఐ వలన అనేక సమస్యలు ఏర్పడతాయని, అవి ప్రపంచం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు ప్రపంచం అంతా అణ్వాయుధాలు ప్రమాదకరం అనుకున్నారు కాని ఇపుడు వాటికంటే ప్రమాదకరంగా ఏఐ ఉండబోతుందని తెలిపారు. ఏఐ సృష్టించే ప్రమాదాలను ఎదుర్కోడానికి ప్రపంచ దేశాలు సిద్దంగా ఉండాలని సూచించారు. లేకపోతే అనేక దుష్పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రపంచీకరణ అనేది ఆయుధంగా మారుతుందని, దీనిపట్ల కూడా అన్ని దేశాలు జాగ్రత్తగా ఉండాలని జైశంకర్ పేర్కొన్నారు.