Mohan Bhagwat : హిందువులు ఐక్యంగా ఉండాలి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

సమాజంలో ఉన్న విబేధాలను పక్కన బెట్టి హిందువులు ఐక్యం కావాలని రాష్ట్రీయ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు.

Update: 2024-10-06 11:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సమాజంలో ఉన్న విబేధాలను పక్కన బెట్టి హిందువులు ఐక్యం కావాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. రాజస్థాన్‌లోని బరన్‌లో తాజాగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హిందూ సమాజం తమ భద్రత కోసం భాష. కులం, ప్రాంతం వంటి వాటిని తొలగించి ఐక్యం కావాలన్నారు. హిందూ అనే పదం తరువాత వచ్చినప్పటికీ పురాతన కాలం నుంచి హిందువులు ఈ దేశంలో నివసిస్తున్నట్టు చెప్పారు. నిరంతర చర్చల ద్వారా వారు ఎంతో సామరస్యంతో జీవిస్తున్నట్టు తెలిపారు. సామాజిక సామరస్యం, న్యాయం, ఆరోగ్యం, విద్య, స్వావలంబనపై ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఎల్లప్పుడూ చురుకుగా పని చేస్తూ సమాజంలో సామరస్యం, పర్యావరణం, దేశీయ విలువలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఆర్‌ఎస్‌ఎస్ పనితీరు యాంత్రికమైనది కాదని, ఆలోచనపై ఆధారపడి పనిచేస్తుందని నొక్కి చెప్పారు.


Similar News