Ramdas Athawale: కశ్మీర్‌లో 17 స్థానాల్లో ఆర్‌పీఐ పోటీ.. కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే

కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 16 నుంచి17 స్థానాల్లో పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే తెలిపారు.

Update: 2024-09-03 18:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 16 నుంచి17 స్థానాల్లో పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) చీఫ్ రాందాస్ అథవాలే తెలిపారు. మిగతా స్థానాల్లో బీజేపీకి మద్దతిస్తామని చెప్పారు. మంగళవారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. హర్యానాలోనూ 10 నుంచి12 స్థానాల్లో పోటీ చేస్తామని మిగతా సెగ్మెంట్లలో బీజేపీకి మద్దతు తెలుపుతామని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్, హర్యానా రెండు చోట్లా ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడుతుందని దీమా వ్యక్తం చేశారు. ఆర్‌పీఐ హర్యానా యూనిట్ అధ్యక్షుడు రవి సోను కుండ్లీ మాట్లాడుతూ..రాష్ట్ర స్థాయిలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అందులో 2 సీట్లు డిమాండ్ చేస్తున్నామని, ఒకవేళ ఒప్పందం కుదరకపోతే 8 నుంచి 10 స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతామని, మిగిలిన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతిస్తామని తెలిపారు. కాగా, ఎన్డీఏ కూటమిలోఆర్‌పీఐ భాగస్వామిగా ఉండటం గమనార్హం.


Similar News