రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం: ఆ స్కీమ్ పేరు మార్పు

రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ‘ఇందిరా రసోయి యోజన’ పేరును

Update: 2024-01-07 04:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ‘ఇందిరా రసోయి యోజన’ పేరును ‘శ్రీ అన్నపూర్ణ రసోయి యోజనగా మార్చింది. దీని ద్వారా సబ్సిడీ ధరలకు భోజనం అందిస్తారు. అంతేగాక ఒక్కో ప్లేట్‌కు చెల్లించాల్సిన ప్రభుత్వ గ్రాంట్‌ను రూ. 17 నుంచి రూ. 22 కి పెంచినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అన్ని హోర్డింగ్‌లు, ఆన్‌లైన్ పోర్టల్‌లలోనూ పేరు మార్చాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఇందిరా రసోయి యోజన ద్వారా కేవలం రూ. 8కే పౌష్టికాహారాన్ని అందిస్తారు. ‘ఎవరూ ఆకలితో నిద్రపోకూడదు’ అనే ట్యాగ్‌లైన్‌తో ఆగస్టు 2020లో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ స్కీమ్‌ను ప్రారంభించింది. 

Tags:    

Similar News