Odisha train accident: కారణాలు ఇప్పుడే చెప్పలేం, ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు..

కోరమండల్ సూపర్ ఫాస్ట్ రైలు ప్రమాదంలో గాయపడిన వారికి మైరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

Update: 2023-06-03 06:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: కోరమండల్ సూపర్ ఫాస్ట్ రైలు ప్రమాదంలో గాయపడిన వారికి మైరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. శనివారం ఒడిషాలోని కోరమండల్ రైలు ప్రమాద స్థలాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రస్తుతం సహయచర్యలపై పూర్తిగా దృష్టి సారించామని తెలిపారు.

ఘటన స్థలంలో యుద్ధ ప్రాతిపదికన సహయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రమాద స్థలంలో సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇక, ఈ రైలు ప్రమాదంపై కారణాలను ఇప్పటికిప్పుడే చెప్పలేమని.. ప్రమాద ఘటనపై దర్యాప్తునకు నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. కమిటీ నివేదిక వచ్చాక ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. కోరమండల్ రైలు ప్రమాద ఘటనలో గంట గంటకు మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే 278 మంది మృతి చెందగా.. మరో 900 మంది గాయపడ్డట్లు సమాచారం. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ ఆసుపత్రుల్లో గాయపడ్డవారికి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, మరి కాసేపట్లో ప్రధాని మోడీ రైలు ప్రమాదం జరిగిన ఘటన స్థలాన్ని పరిశీలించనున్నారు.

Also Read..

Coromandel express accident:14 ఏళ్ల క్రితం ఇదే శుక్రవారం.. అదే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ విషాదం 

Tags:    

Similar News