ఈడీ ఇన్ఛార్జ్ డైరెక్టర్‌గా రాహుల్ నవీన్..
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇన్ఛార్జ్ డైరెక్టర్‌గా స్పెషల్ డైరెక్టర్ రాహుల్ నవీన్‌ను కేంద్ర సర్కారు శుక్రవారం నియమించింది.
న్యూఢిల్లీ : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇన్ఛార్జ్ డైరెక్టర్‌గా స్పెషల్ డైరెక్టర్ రాహుల్ నవీన్‌ను కేంద్ర సర్కారు శుక్రవారం నియమించింది. రెగ్యులర్ డైరెక్టర్ నియామకంపై తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈడీ ఇన్ ఛార్జ్ డైరెక్టర్ గా రాహుల్ వ్యవహరిస్తారని వెల్లడించింది. దీంతో 1984 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారి సంజయ్ కుమార్ మిశ్రా స్థానంలో, 1993 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి రాహుల్ నవీన్ బాధ్యతలు చేపట్టారు.
నవీన్ గతంలో ఈడీ హెడ్ క్వార్టర్స్‌లో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలతో మాజీ ఈడీ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలం సెప్టెంబర్ 15తో ముగిసింది. అంతకుముందు రెండుసార్లు సంజయ్ కుమార్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. అయితే ఈసారి పదవీ కాలాన్ని పొడిగించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో, అనివార్య పరిస్థితుల్లో కేంద్రం తాత్కాలిక డైరెక్టర్‌ను నియమించింది.