జూన్ 4 తర్వాత ‘కాంగ్రెస్ ధూండో యాత్ర’ అవసరం : అమిత్ షా
దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు.
దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. ‘‘లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని భారత్ జోడో యాత్రతో రాహుల్‌గాంధీ ప్రారంభించారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాక .. ఆయన కాంగ్రెస్ ధూండో యాత్ర (కాంగ్రెస్‌ను కనిపెట్టే యాత్ర)ను ప్రారంభించాల్సి ఉంటుంది’’ అని కేంద్ర హోం మంత్రి కామెంట్ చేశారు. యూపీలోని బరేలీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా ప్రసంగించారు. ఓటుబ్యాంకు దూరం అవుతుందనే భయంతోనే రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, అఖిలేష్ యాదవ్‌లు అయోధ్యరామ మందిర కార్యక్రమానికి హాజరు కాలేదన్నారు. ఇండియా కూటమిలో మిత్రపక్షంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తన కుటుంబంలోని ఐదుగురికి లోక్‌సభ టికెట్లు ఇచ్చుకున్నారని కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీలోని వంశపారంపర్య రాజకీయాలకు ఈ పరిణామం నిదర్శనమని చెప్పారు. ‘‘కనౌజ్ నుంచి అఖిలేష్ యాదవ్, మెయిన్‌పురి నుంచి ఆయన భార్య డింపుల్ యాదవ్, అఖిలేష్ కుటుంబ సభ్యులు అక్షయ్ యాదవ్, ఆదిత్య యాదవ్, ధర్మేంద్ర యాదవ్‌లు ఫిరోజాబాద్, బుదౌన్, ఆజంగఢ్‌ల నుంచి పోటీలో ఉన్నారు’’ అని అమిత్‌షా తెలిపారు.