ప్రధాని మోడీతో పబ్లిక్ డిబేట్‌‌.. రాహుల్‌గాంధీ కీలక ప్రకటన

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పబ్లిక్ డిబేట్‌లో పాల్గొనేందుకు తాను 100 శాతం రెడీ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటించారు.

Update: 2024-05-10 17:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పబ్లిక్ డిబేట్‌లో పాల్గొనేందుకు తాను 100 శాతం రెడీ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటించారు. అయితే ప్రధాని మోడీ గురించి తనకు పూర్తిగా తెలుసని.. ఆయన తనతో పబ్లిక్ డిబేట్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించరని వెల్లడించారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ‘రాష్ట్రీయ సమావేశ్’ పేరుతో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు.

‘‘ఇద్దరు మాజీ న్యాయమూర్తులు, ఒక సీనియర్ జర్నలిస్టు కలిసి మిమ్మల్ని, ప్రధాని మోడీని పబ్లిక్ డిబేట్‌కు ఆహ్వానించారు. మీరు వెళ్తారా ?’’ అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ‘‘తప్పకుండా ఆ కార్యక్రమానికి హాజరవుతా’’ అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అయితే తనతో డిబేట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ రావడమనేది డౌటేనని వ్యాఖ్యానించారు. ‘‘ ప్రధాని మోడీతో పబ్లిక్ డిబేట్‌లో పాల్గొనేందుకు నేను 100 శాతం రెడీగా ఉన్నాను. నాకు తెలిసినంత వరకు.. ప్రధాని మోడీ 100 శాతం నాతో డిబేట్ చేయడానికి ఇష్టపడరు’’ అని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, ప్రధాని మోడీలను పబ్లిక్ డిబేట్‌కు ఆహ్వానిస్తూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ లోకూర్, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఏపీ షా, ‘ది హిందూ’ వార్తాపత్రిక మాజీ ఎడిటర్ ఎన్ రామ్ గురువారం లేఖ రాశారు.

Tags:    

Similar News