Puri Radhayathra: పూరి జగన్నాథుడి ఉత్సవాల్లో మరో అపశృతి.. ఐదుగురు పూజారులకు గాయాలు

ఉత్తర‌ప్రదేశ్ సత్సంగ్ యాత్రలో తొక్కిసలాట మరువక ముందే పూరిలోని జగన్నాథుడి రథ‌యాత్రలో అపశృతి చోటు‌చేసుకుంది.

Update: 2024-07-10 04:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర‌ప్రదేశ్ సత్సంగ్ యాత్రలో తొక్కిసలాటను జనం పూర్తిగా మరువక ముందే పూరిలోని జగన్నాథుడి రథ‌యాత్రలో మరో అపశృతి చోటు‌చేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా రథాన్ని నుంచి గుండిచా ఆలయానికి తీసుకువెళ్తుండగా ప్రమాదవశాత్తు బలభద్రుడి విగ్రహంతో ఉన్న పల్లకి అదుపతప్పి పూజారులపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ప్రధాన ఆలయానికి చెందిన ఐదుగురు పూజారులకు తీవ్రంగా గాయాలయ్యాయి. అనంతరం అక్కడున్న వారు క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆదివారం సాయంత్రం బలభద్రుడి రథం తల దర్వాజ లాగుతుండగా బడా దండ ప్రాంతానికి రాగానే భక్తులు ఒక్కసారిగా జగన్నాథుడుని చూసేందుకు ఎగబడ్డారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో పలువురికి గాయలయ్యాయి.


Similar News