ISRO: పీఎస్‌ఎల్‌వీ-సీ 56 రాకెట్ ప్రయోగం సక్సెస్.. ఇస్రో మరో అరుదైన ఘనత
ఇటీవల ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌తో సక్సెస్ అందుకున్న ఇస్రో.. ఇవాళ మరో విజయం సాధించింది.
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌తో సక్సెస్ అందుకున్న ఇస్రో.. ఇవాళ మరో విజయం సాధించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుండి ఆదివారం ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ 56 ప్రయోగం విజయవంతమైంది. పీఎస్‌ఎల్‌వీ-సీ 56 రాకెట్ ద్వారా ఏడు ఉపగ్రహాలను సక్సె్స్ ఫుల్‌గా భూ కక్షలోకి ప్రవేశ పెట్టినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. డీఎస్- సార్ ప్రధాన ఉపగ్రహంతో పాటు మరో ఆరు చిన్న ఉపగ్రహాలను ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. పీఎస్‌ఎల్‌వీ-సీ 56 ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో సైంటిస్ట్‌లు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా శాస్రవేత్తలకు చైర్మన్ సోమనాథ్ శుభాకాంక్షలు తెలిపారు.
ఇస్రోకు ఈ ఏడాది ఇది మూడవ వాణిజ్య ప్రయోగం కాగా.. ఈ పీఎస్‌ఎల్‌వీ-సీ 56 రాకెట్ ద్వారా సింగపూర్‌కు చెందిన 420 కిలోల బరువు గల ఏడు ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. పీఎస్‌ఎల్‌వీ-సీ 56 రాకెట్ ప్రయోగం సక్సెస్ అయిన సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. పీఎస్‌ఎల్‌వీ-సీ 56 రాకెట్ ఏడు ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టిందని తెలిపారు. ఇస్రోపై నమ్మకం ఉంచిన సింగపూర్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వాహననౌక ఉపగ్రహాలను కచ్చితమైన కక్షలోకి ప్రవేశపెట్టిందని వెల్లడించారు. పీఎస్‌ఎల్వీ శ్రేణిలో మరిన్ని ప్రయోగాలు చేపడుతున్నామన్నారు. ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో మరో పీఎస్‌ఎల్వీ ప్రయోగం చేపట్టనున్నామని తెలిపారు.