Proba-3: సూర్యుని కరోనాపై అవగాహనకు సహాయపడనున్న ప్రోబా-3 మిషన్

సౌర గాలులపై అవగాహనను గణనీయంగా పెంచుతుందని పీ వీ వెంకటకృష్ణన్ అన్నారు.

Update: 2024-12-08 14:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పీఎస్ఎల్‌వీ-సీ59 రాకెట్‌లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) ప్రోబా-3 ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా ప్రయోగించడం ఒక 'గ్రౌండ్‌బ్రేకింగ్ మిషన్' ఇస్రో మాజీ శాస్త్రవేత్త చెప్పారు. ప్రోబా-3 సూర్యుని కరోనా, సౌర గాలులపై అవగాహనను గణనీయంగా పెంచుతుందని ఇస్రో కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఆఫీస్ మాజీ డైరెక్టర్ పీ వీ వెంకటకృష్ణన్ అన్నారు. మిషన్‌లో ఉపయోగించిన 'వినూత్న డిజైన్, అధునాతన సాంకేతికతలు' భవిష్యత్తులో అంతరిక్ష వాతావరణ అంచనా, సౌర భౌతిక పరిశోధనలకు మార్గం సుగమం చేస్తాయి. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధనల కోసం ప్రోబా ప్రాజెక్టును చేపట్టారు. ఈ తరహా ప్రయోగం చేపట్టడం ప్రపంచంలో మొదటిసారి అని ఈఎస్ఏ పేర్కొంది. సూర్యుని ఉపరితలం కంటే వేడిగా ఉండే కరోనాను అధ్యయనం చేయడం, సూర్యుడి నుంచి వెలువడే చార్జ్‌డ్ కణాల ప్రవాహమైన సౌరగాలిని అన్వేషించడం దీని లక్ష్యమని వెంకటకృష్ణన్ అన్నారు. ప్రోబా-3 ఉపగ్రహాల నుంచి వచ్చిన డేటా ద్వారా శాస్త్రవేత్తలు అంతరిక్ష వాతావరణాన్ని బాగా అర్థం చేసుకోవడానికి, అంచనా వేయడానికి సహాయపడుతుంది. ఇది భూమి అయస్కాంత క్షేత్రం, ఉపగ్రహ తీరును ప్రభావితం చేస్తుందని వెల్లడించారు. కాగా, గత వారం పీఎస్‌ఎల్‌వీ-సీ59 ప్రయోగం విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈఎస్ఏకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాలతో పాటు మరికొన్ని చిన్న ఉపగ్రహాలను ఈ మిషన్ నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 

Tags:    

Similar News