అన్న ఇలాకాలో చెల్లి.. వయనాడ్ బై పోల్ బరిలో ప్రియాంక గాంధీ

గత కొన్ని రోజులుగా దేశ రాజకీయాల్లో నెలకొన్న తీవ్ర ఉత్కంఠ ఎట్టకేలకు తెరపడింది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్ బరేలీ

Update: 2024-06-17 14:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత కొన్ని రోజులుగా దేశ రాజకీయాల్లో నెలకొన్న తీవ్ర ఉత్కంఠ ఎట్టకేలకు తెరపడింది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్ బరేలీ లోక్ సభ స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. రెండు చోట్ల ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో రాహుల్ గాంధీ వయనాడ్ స్థానాన్ని వదులుకుని.. రాయ్ బరేలీ నుండి ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నారు. రాహుల్ వయనాడ్‌ లోక్ సభ స్థానానికి రిజైన్ చేయనుండటంతో ఆ సీటుకు ఆరు నెలల్లో ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలోనే వయనాడ్ బై పోల్‌కు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తన సోదరుడు రాహుల్ గాంధీ సిట్టింగ్ స్థానమైన వయనాడ్ నుండి బరిలోకి దిగుతారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. దీంతో ఫస్ట్ టైమ్ ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ కంచుకోటైనా వయనాడ్‌లో ప్రియాంక గాంధీ గెలుపు నల్లేరు మీద నడకే అని అ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 

Tags:    

Similar News