నితీశ్‌కు ఇండియా కూటమి ప్రధాని ఆఫర్..కానీ: జేడీయూ నేత కీలక వ్యాఖ్యలు

బిహార్ సీఎం, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) అధినేత నితీశ్ కుమార్‌కు ఇండియా కూటమి ప్రధాని పదవి ఇస్తామని ఆఫర్ చేసిందని, అయితే ఆ ప్రతిపాదనను ఆయన తిరస్కరించారని జేడీయూ నేత కేసీ త్యాగి తెలిపారు.

Update: 2024-06-08 09:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ సీఎం, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) అధినేత నితీశ్ కుమార్‌కు ఇండియా కూటమి ప్రధాని పదవి ఇస్తామని ఆఫర్ చేసిందని, అయితే ఆ ప్రతిపాదనను ఆయన తిరస్కరించారని జేడీయూ నేత కేసీ త్యాగి తెలిపారు. శనివారం ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. అత్యన్నత పదవి ఇస్తానని చెప్పినప్పటికీ జేడీయూ మాత్రం ఎన్డీయే వైపే మొగ్గు చూపినట్టు తెలిపారు. ఇండియా కూటమి ప్రతిపాదనలను స్వీకరించబోమని స్పష్టం చేశారు. కూటమి కన్వీనర్‌గా నితీశ్‌ను అంగీకరించని నేతలు ఎన్నికల తర్వాత మాత్రం పీఎం ఆఫర్ ఇచ్చారని చెప్పారు. దీని కోసం కొందరు నాయకులు నేరుగా నితీశ్‌ను సంప్రదించాలని ప్రయత్నాలు చేసినట్టు వెల్లడించారు. ఎన్డీయేను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలను ఇండియా కూటమి ఖండించింది.


Similar News