దుబాయ్ వెళ్ళే ఫ్లైట్ లో సాంకేతిక లోపం... ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నం

తమిళనాడు నుండి దుబాయ్ వెళ్తున్న ఓ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

Update: 2024-10-11 14:33 GMT

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు నుండి దుబాయ్ వెళ్తున్న ఓ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. తమిళనాడులోని తిరుచ్చి నుండి దుబాయ్ లోని షార్జా వెళ్తున్న విమానం హైడ్రాలిక్ వ్యవస్థ ఫెయిల్ అయినట్టు పైలట్లు గుర్తించారు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపట్లోనే ఈ లోపాన్ని గుర్తించిన పైలెట్లు.. వెంటనే తిరుచ్చి ఎయిర్ కంట్రోల్ రూమ్ కి సమాచారం అందించి, ఫ్లైట్ ను అత్యవసరంగా ల్యాండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. హైడ్రాలిక్ సిస్టమ్ ఫెయిల్ అవడంతో దాదాపు గంటన్నర నుండి ఆ విమానం గాలిలోనే చక్కర్లు కొడుతునట్టు తెలుస్తోంది. కాగా తిరుచ్చి ఎయిర్ పోర్టులో ఇప్పటికే పెద్దసంఖ్యలో పారా మెడికల్ సిబ్బంది, 20 ఫైర్ ఇంజన్లు, 20 అంబులెన్సులు సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. AXB-613 విమానంలో సిబ్బందితో సహ 140 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. విమానం సేఫ్ ల్యాండింగ్ కోసం మిగతా విమానలన్నీటిని దారి మళ్లించారు. టేకాఫ్ అయ్యే విమానాలను ఆపివేశారు. కాగా విమానంలోని తమ వారికోసం బంధువులు బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు. ఫ్లైట్ బెల్లీ ల్యాండింగ్ తరువాత పల్టీలు కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు ఎయిర్ పోర్ట్ అధికారులు చెబుతున్నారు. 


Similar News