రామమందిరంపై పోస్టల్ స్టాంపులు విడుదల చేసిన ప్రధాని మోడీ

రామ మందిరం, గణనాథుడు, హనుమంతుడు, జటాయువు, శబరిమాత, కేవత్‌రాజ్‌పై ఆరు స్టాంప్‌లు, రాముడి స్టాంపులతో కూడిన పుస్తకం విడుదల

Update: 2024-01-18 08:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సమీపిస్తున్న నేపథ్యంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం రామ మందిరంపై స్మారక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. అలాగే, రామ మందిరం, గణనాథుడు, హనుమంతుడు, జటాయువు, శబరిమాత, కేవత్‌రాజ్‌పై ఆరు స్టాంప్‌లను, రాముడికి అంకితం చేసిన స్టాంపులతో కూడిన పుస్తకాన్ని విడుదల చేశారు. అయోధ్య ఆలయానికి సంబంధించిన ఆకృతి, మందిరంలో ఉన్న కళాఖండాలు, సూర్యభగవానుడు, సరయూ నది కనిపించేలా ఈ స్టాంపులను డిజైన్ చేశారు. అంతేకాకుండా స్టాంపులపై 'మంగల్ భవన్ అమంగల్ హరి ' అనే కవితను కూడా ముద్రించారు. ప్రపంచవ్యాప్తంగా రాముడికి చెందిన స్టాంపులతో కూడిన పుస్తకం 48 పేజీలతో రూపొందించారు. ఇప్పటివరకు 20 దేశాలు, ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సంస్థలు రాముడి స్మారక స్టాంపులను తీసుకొచ్చాయి. స్టాంపుల ఆవిష్కరణ గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, 'ఈరోజు, శ్రీరామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ అభియాన్ నిర్వహిస్తున్న మరో కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు లభించింది. తపాలా స్టాంపుల విడుదల సందర్భంగా దేశ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను' అన్నారు. 

Tags:    

Similar News