ప్రధాని మోడీ మరో సాహసం! సముద్ర గర్భంలోని ద్వారక నగరంలో పూజలు!

లక్షదీవుల్లో ప్రధాని మోడీ ఇటీవల స్నార్కెలింగ్ సాహసం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రధాని మరో సాహసం చేశారు.

Update: 2024-02-25 11:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: లక్షదీవుల్లో ప్రధాని మోడీ ఇటీవల స్నార్కెలింగ్ సాహసం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రధాని మరో సాహసం చేశారు. ప్రధాని మోడీ ఇవాళ గుజరాత్‌లో పర్యాటించారు. పర్యటనలో భాగంగా ద్వారకలో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి ‘సుదర్శన సేతు’ ను మోడీ ప్రారంభించారు. ఈ క్రమంలోనే ద్వారకాధీశ్ ఆలయాన్ని సందర్శించి శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. అంతే కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ద్వారకను ప్రధాని సందర్శించారు. ఈ క్రమంలోనే ఆయన ఆక్సిజన్ మాస్క్ ధరించి సముద్రం లోపలికి వెళ్లి పూజలు చేశారు.

 

ఈ క్రమంలోనే ఆయన ట్విట్టర్ వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారు. నీటిలో మునిగి ఉన్న ద్వారకా నగరంలో ప్రార్థన చేయడం చాలా దివ్యమైన అనుభవమని పేర్కొన్నారు. నేను ఆధ్యాత్మిక వైభవం, కాలాతీత భక్తి, పురాతన యుగానికి కనెక్ట్ అయ్యానని తెలిపారు. భగవాన్ శ్రీ కృష్ణుడు మనందరినీ అనుగ్రహించు గాక అని ఎక్స్‌లో ఫోటోలు షేర్ చేశారు.

 

Tags:    

Similar News