విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడం పై ప్రధాని మోడీ ఆసక్తికర కామెంట్స్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Update: 2023-11-27 07:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవడంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘ అవును.. పెళ్లి టాపిక్ వచ్చినప్పటి నుంచి.. చాలా కాలంగా ఒక విషయం నన్ను కలవరపెడుతోంది.. ఈ ఆవేదనను నా కుటుంబ సభ్యులకు చెప్పకపోతే ఇంకెవరికి చెబుతాను.. ఒక్కసారి ఆలోచించండి.. ఈ రోజుల్లో కొన్ని కుటుంబాలు విదేశాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకునేందుకు కొత్త వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఇది అవసరమా. ఇలాంటి పెళ్లిళ్లలో దేశ ప్రజలకు ఏదో విధంగా సేవ చేసే అవకాశం లభిస్తుందని సూచిస్తున్నాను. కాకపోతే.. మీకు కావాల్సినవి ప్రస్తుతం అందుబాటులో ఉండకపోవచ్చు.. కానీ ఇటువంటి వేడుకలు ఇక్కడే నిర్వహించుకుంటుంటూ ఉంటే అవి అభివృద్ధి చెందుతాయి.

ఇది ముఖ్యంగా ప్రముఖుల కుటుంబాలకు నా ఆవేదన, బాధ వారికి చేరుతుందనే అనుకుంటున్నా. దేశ నిర్మాణ బాధ్యతలును ప్రజలు తీసుకున్నప్పుడు ఆ దేశానికి ముందుకు సాగకుండా ప్రపంచంలోని ఏ శక్తి కూడా ఆపలేదు. భరత్‌లో 140 కోట్ల మంది ప్రజలు అనేక పరివర్తనలకు నాయకత్వం వహిస్తున్నారు. అది దేశంలో స్పష్టంగా కనిపిస్తోంది. పండుగలు వస్తే వ్యాపారం విస్తారంగా జరుగుతుంది. ప్రజలు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో ఉత్సాహం చూపిస్తున్నారు’’ అంటూ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News