ఉగ్రవాదులను జైలు నుండి విడుదల చేసిన ఘనత కాంగ్రెస్‌దే: ప్రధాని మోడీ ఫైర్

కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ మరోసారి ఫైర్ అయ్యారు. బుధవారం కర్నాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ మూడబిద్రేలో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు.

Update: 2023-05-03 07:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ మరోసారి ఫైర్ అయ్యారు. బుధవారం కర్నాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ మూడబిద్రేలో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. దేశంలోని జాతీయ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందని.. జాతీయ వ్యతిరేకులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుని.. ఉగ్రవాద మద్దతుదారులకు రక్షణ కల్పిస్తారని మండిపడ్డారు. ఉగ్రవాదులను జైలు నుంచి విడుదల చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని ధ్వజమెత్తారు.

దేశం మొత్తం మన సైనికులకు అండగా నిలుస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం మన సైనికులను అవమానిస్తోందన్నారు. అలాంటి పార్టీ ఇప్పుడు కర్నాటకలో ఓట్లు అడుగుతోందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ది విభజించు.. పాలించు సిద్ధాంతమని అన్నారు. హింస, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంలో కాంగ్రెస్‌‌కు మంచి పేరుందని.. దక్షిణ కన్నడ జిల్లాలోని యువ ఓటర్లు శాంతి, సామరస్యాలను కోరుకుంటే, బీజేపీకి ఓటు వేయాలని మోడీ కోరారు. కర్నాటకలో శాంతి నెలకొల్పుతామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని ఒక కుటుంబానికి కర్ణాటకను ఏటీఎంగా మార్చాలని కాంగ్రెస్‌ భావిస్తోంది జాగ్రత్త అని అన్నారు.

Tags:    

Similar News