కాంగ్రెస్ పాలనలో ఆవు పేడనూ వదల్లేదు.. మోదీ సెటైర్

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి విరుచుకుపడ్డారు

Update: 2023-09-30 13:17 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ప్రతి స్కీమ్ లోనూ స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో శనివారం జరిగిన పరివర్తన్ మహా సంకల్ప్ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని.. రేషన్, మద్యంతో పాటు చివరకు ఆవు పేడనూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు వదలలేదని ఆరోపించారు. భూపేష్ బఘేల్ సారథ్యంలోని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం అవినీతికి నిలయంగా మారిందని ధ్వజమెత్తారు. కరోనా సమయంలో నేను పీఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద రేషన్ పంపిణీ చేస్తే.. బఘేల్ ప్రభుత్వం అందులోనూ అవినీతికి పాల్పడిందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మిస్తామని, తొలి కేబినెట్ సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని మోడీ హామీ ఇచ్చారు.

Tags:    

Similar News