ఎట్టకేలకు సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన మోడీ.. ప్రధాని విజయ రహస్యం ఏంటంటే..?

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో మోడీ మరోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

Update: 2024-06-10 13:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో మోడీ మరోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోడీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తద్వారా మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టారు. ఈ క్రమంలో పీఎంవో సిబ్బందితో మోడీ సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది మోడీ పీఎంవో కాదని ప్రజల పీఎంవో అని, అభివృద్ధికి మీరు ఒక వారధిలాంటివారన్నారు. నేను అధికారం కోసమో.. పదవి కోసమో లేననని.. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సూచించారు. 140 కోట్ల మంది భారతీయులు నాకు పరమాత్మతో సమానమని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇక, చాలామంది నా విజయ రహస్యం ఏమిటని అడుగుతుంటారని, నిత్య విద్యార్థిగా ఉండటమే నా సక్సెస్ సీక్రెట్ అని మోడీ తన విజయ రహస్యాన్ని రివీల్ చేశారు. నిత్య విద్యార్థిగా ఉండే వారే విజయం సాధిస్తారని పేర్కొన్నారు.


Similar News