President Murmu: మహిళలను చూసే విధానంలో మార్పు రావాలి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

మహిళలను అర్థం చేసుకునే విధానంలో మార్పు రావాలని రాష్ట్రపతి ముర్ము తెలిపారు. దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

Update: 2024-09-03 19:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహిళలను అర్థం చేసుకునే, చూసే విధానంలో మార్పు రావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) తెలిపారు. దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ముంబైలో మంగళవారం జరిగిన మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్( Legislative Council) శతాబ్ది ఉత్సవాల్లో ఆమె ప్రసంగించారు. జనాభాలో 50 శాతం ఉన్న మహిళల సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన అభివృద్ధి లేకుండా దేశ పురోగతి సాధ్యం కాదన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వివిధ రంగాల్లో మహిళల చురుకైన భాగస్వామ్యం అవసరమని నొక్కి చెప్పారు. మహారాష్ట్రకు చెందిన ప్రతిభా పాటిల్ భారతదేశానికి మొదటి మహిళా రాష్ట్రపతి అయ్యారని గుర్తు చేశారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లి జీజాబాయి, సంఘ సంస్కర్త సావిత్రీబాయి ఫూలే సేవలను ఆమె కొనియాడారు. వీరిద్దరూ మహిళలకు ఎంతో ఆదర్శమని తెలిపారు.


Similar News