Queen Elizabeth's అంత్యక్రియలకు హాజరుకానున్న రాష్ట్రపతి Droupadi Murmu

బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. భారత ప్రభుత్వం తరఫున రాణికి నివాళులర్పించనున్నారు.

Update: 2022-09-14 11:32 GMT

న్యూఢిల్లీ: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. భారత ప్రభుత్వం తరఫున రాణికి నివాళులర్పించనున్నారు. క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి సెప్టెంబర్ 17 -19వ తేదీల్లో లండన్‌లో పర్యటించనున్నారు. భారీ సైనిక ఊరేగింపు నడుమ ఎలిజబెత్-2 అంతిమయాత్ర సెప్టెంబర్ 19న వెబ్‌మిన్‌స్టర్ హాల్‌కు చేరుకోనుంది. ఈ అంతిమయాత్రలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయా దేశాల అధినేతలు, ప్రధానమంత్రులు హాజరుకానున్నారు. కాగా, సెప్టెంబర్ 8వ తేదీన స్కాట్లాండ్‌లో క్వీన్ ఎలిజబెత్-2 తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్, ప్రధాని మోడీ, భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ తదితరులు సంతాపం తెలిపారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 11న భారత దేశం జాతీయ సంతాప దినాన్ని కూడా ప్రకటించింది.

Tags:    

Similar News