రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం లేదు: ప్రశాంత్ కిషోర్

దేశరాజకీయాల్లో వ్యూహాలు రచిస్తూ అనేక పార్టీలను అధికారంలోకి తీసుకు వచ్చిన ప్రశాంత్ కిషోర్ తాజాగా ఓ రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నారు.

Update: 2024-08-04 09:26 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశరాజకీయాల్లో వ్యూహాలు రచిస్తూ అనేక పార్టీలను అధికారంలోకి తీసుకు వచ్చిన ప్రశాంత్ కిషోర్ తాజాగా ఓ రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నారు. వచ్చే బీహార్ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆయన.. తన పార్టీకి జన్ సూరజ్ అనే పేరు పెట్టారు. ఈ సందర్భంగా నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "అక్టోబర్ 2న ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం లేదని తెలిపారు. కోటి మంది బీహార్‌ ప్రజలు తమ పిల్లల భవిష్యత్తు కోసంనితీష్, లాలూలను వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, వలసలను ఆపడానికి ఏకతాటిపైకి వచ్చి "జన్ సూరజ్" పార్టీని ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అలాగే తాను గతంలో ఇతర పార్టీలకు సహాయం చేసేవాడిని, ఎన్నికల్లో ఎలా గెలవాలి, పార్టీలు ఏర్పాటు చేయడం, ప్రచారం చేయడంపై నాయకులకు సలహాలు ఇచ్చే వాడిని.. కానీ ఇప్పుడు నేను బీహార్ ప్రజలకు సూచనలు ఇస్తాను" అని జన్ సూరజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్ మీడియాతో చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News