Prashant Kishor: బిహార్ ఫలితాలు ఆశ్చర్యంగా ఉంటాయి.. జన్ సూరజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్

బిహార్‌లో ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయని జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ అన్నారు.

Update: 2025-02-11 18:59 GMT
Prashant Kishor:  బిహార్ ఫలితాలు ఆశ్చర్యంగా ఉంటాయి.. జన్ సూరజ్ చీఫ్ ప్రశాంత్ కిషోర్
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయని జన్ సూరజ్ పార్టీ (Jan suraj party) చీఫ్ ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore) అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణం ఎన్నికల్లో గెలిచినా, గెలవకపోయినా 2025 నవంబర్ తర్వాత నితీశ్ కుమార్ (Nithish kumar) ఇకపై బిహార్ సీఎంగా ఉండబోరని తెలిపారు. నితీశ్ శారీరకంగా అలసిపోయి మానసికంగా రిటైర్మెంట్ అయ్యారని విమర్శించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. బిహార్‌లో ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ దయతోనే కొనసాగుతోందని నితీశ్ కేవలం ముసుగుగానే మిగిలిపోయారని ఆరోపించారు. సీట్ల విభజన జరిగినప్పుడు, జేడీయూ 100 సీట్ల కోసం పోరాడొచ్చు.. కానీ ఎవరు గెలిచినా నితీశ్ మాత్రం సీఎంగా ఉండడు, బీజేపీ తన అభ్యర్థిగా ముఖ్యమంత్రిగా నియమించుకుంటుంది అని తెలిపారు. అయితే బీజేపీకి రాష్ట్ర రాజకీయాలను స్వయంగా నిర్ణయించేంత బలం లేదన్నారు. మూడింట రెండు వంతుల మంది మార్పు కోరుకుంటున్నారని, రాబోయే ఫలితాలు షాకింగ్ గా ఉంటాయని అంచనా వేశారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలిచి ఉండొచ్చని, కానీ బిహార్‌ పరిస్థితులు, రాజకీయాలు వేరు అని చెప్పారు. కాగా, ఈ ఏడాది చివరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 

Tags:    

Similar News