లైవ్‌లో స్పృహ తప్పి పడిపోయిన ప్రముఖ టీవీ యాంకర్.. కారణమిదే!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. జనాలు ఇళ్లనుంచి బయటికెళ్దామంటే జంకుతున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. జనాలు ఇళ్లనుంచి బయటికెళ్దామంటే జంకుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప వృద్ధులు, గర్భిణులు బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే పెరిగిన ఉష్ణోగ్రతల గురించి వార్తలు చదివే ఓ యాంకరే తాజాగా ఎండల వల్ల స్పృహ కోల్పోయింది. ఈ ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది. దూరదర్శన్ టీవీ స్టూడియోలో యాంకర్‌గా పనిచేస్తోన్న లోపాముద్ర సిన్హా లైవ్‌లో వార్తలు చదువుతుండగా.. బీపీ డౌన్ అయి కుర్చీలో వెనక్కి వాలిపోయారు. అనంతరం ఈ ఘటనపై సిన్హా తన ఫేస్బుక్ ద్వారా వివరణ ఇచ్చారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ను ఎండలు వణికిస్తున్నాయి. ఇకపోతే పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.