Dy CM Bhatti Vikramarka: ఝార్ఖండ్‌లో తెలంగాణ డిప్యూటీ సీఎం.. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా బిజీ బిజీ

మహారాష్ట్ర (Maharastra), ఝార్ఖండ్ (Jharkhand) అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో కాంగ్రెస్ (Congress) పార్టీ స్పీడ్ పెంచింది.

Update: 2024-11-02 12:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర (Maharastra), ఝార్ఖండ్ (Jharkhand) అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో కాంగ్రెస్ (Congress) పార్టీ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో తమ స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించింది. తాజాగా ఝార్ఖండ్ స్టార్‌ క్యాంపెయినర్‌గా ఎంపికైన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఝార్ఖండ్‌లోని రాంఘర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు (శనివారం) చిత్తార్పూర్ బ్లాక్‌ పర్యటనలో భాగంగా బిజీ బిజీగా గడిపారు. నియోజగవకర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా ఇంటింటి ప్రచారం చేయాలని, బూత్ లెవల్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలని, సోషల్ మీడియా ప్రచారంపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని కార్యకర్తలకు సూచించారు. ఎలాగైనా ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ జెండా పాతాలని పిలుపునిచ్చారు. అందుకోసం రాంఘర్ అసెంబ్లీ నియోకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మమతా దేవి (Mamatha Devi)ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో అనేకమంది స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


Similar News