యూపీఎస్సీ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన పూజా ఖేడ్కర్

తన యూపీఎస్సీ అభ్యర్థిత్వాన్ని రద్దు అధికారం యూపీఎస్సీకి లేదంటూ పూజ ఖేడ్కర్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

Update: 2024-08-28 12:22 GMT

దిశ, వెబ్ డెస్క్ : తన యూపీఎస్సీ అభ్యర్థిత్వాన్ని రద్దు అధికారం యూపీఎస్సీకి లేదంటూ పూజా ఖేడ్కర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ విషయంలో పూజా ఖేడ్కర్ మీద విచారణ జరపగా.. ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించారని తేలడంతో ఫోర్జరీ కేసు నమోదు చేసింది యూపీఎస్సీ. ఈ కేసు ఢిల్లీ హైకోర్టులో ఉండగానే పూజా యూపీఎస్సీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది ఆ సంస్థ. కాగా తాను ఎలాంటి ఫోర్జరీలు చేయలేదని, అన్నీ సరైన సర్టిఫికెట్లు మాత్రమే సమర్పించానని.. తనపై యూపీఎస్సీ చేస్తున్న వాదనలను ఖండిస్తున్నాను అని పూజా పేర్కొంది. కేసు కోర్టులో ఉండగానే తన అభ్యర్థిత్వాన్ని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నిస్తూ.. అసలు తన మీద చర్యలు తీసుకునే అధికారం యూపీఎస్సీకి లేవంది. ఒకవేళ తన మీద ఆరోపణలు నిజమని కోర్టులో తేలితే.. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ కు మాత్రమే ఉందని తెలిపింది. కాగా తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చేంత వరకు తనమీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని పూజా హైకోర్టును కోరగా.. ఈ నెల 29 వరకు గడువు విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.    


Similar News