జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణపై హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-02-14 11:18 GMT

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత దీనిపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. అయితే ఎన్నికల సమయాన్ని ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తుందని చెప్పారు. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుతం పరిస్థితులు మెరుగయ్యాయని, ఉగ్ర సంబంధిత నేరాలు తగ్గాయని చెప్పారు. 2019లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రద్దు చేసిన జమ్ము కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 దేశానికి హాని కలిగించిందని అమిత్ షా అన్నారు. అయితే రాష్ట్రంలో తిరిగి ఎన్నికల నిర్వహణ ఈసీ నే నిర్ణయిస్తుందని తెలిపారు.

ప్రస్తుతం జమ్ముకశ్మీర్ లో పరిస్థితులు మెరుగయ్యాయని, లక్షల సంఖ్యలో పర్యాటకులు కశ్మీర్ వెళ్తున్నారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించే వారు ఎవరి హయాంలో ఉగ్రవాదం పెరిగిందో వెల్లడించాలని అన్నారు. వామపక్ష తీవ్రవాదం కూడా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాల చట్టం ఈశాన్యంలో 60 శాతం మేర ఎత్తివేసినట్లు చెప్పారు.

Tags:    

Similar News