నటి కస్తూరి పై కేసు నమోదు చేసిన పోలీసులు

తమిళ నటి కస్తూరి(actress Kasturi) తెలుగు ప్రజలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-11-06 03:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: తమిళ నటి కస్తూరి(actress Kasturi) తెలుగు ప్రజలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఆమె వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో దిగొచ్చిన ఆమె.. 'మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. నా వ్యాఖ్యలు మీ మనసును బాధపెట్టి ఉంటే క్షమించండి. నేను మాట్లాడిన మాటలు పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నాను' అని నటి కస్తూరి పేర్కొంది. అయినప్పటికీ. ఆమెపై కేసు నమోదైంది. కస్తూరీ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను తీసుకొని.. పలు తెలుగు, తమిళ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే నటిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. దీంతో చెన్నై ఎగ్మోర్ పోలీస్ స్టేషన్ లో నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. "'తెలుగువారు తమిళ రాజుల వద్ద సేవలు చేయడానికి వచ్చి, ఇప్పుడు మేము తమిళులం అంటూ మాట్లాడుతున్నారని' ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి కస్తూరి సంచలన వ్యాఖ్యలు చేశారు."


Similar News