US elections: అమెరికా అధ్యక్ష రేసులో దూసుకుపోతున్న ట్రంప్.. 210 ఎలక్టోరల్ ఓట్లు కైవసం

ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల(US presidential election) ఫలితాలు వెలువడుతున్నాయి.

Update: 2024-11-06 04:11 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల(US presidential election) ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల పోలింగ్ పూర్తయిన ప్రాంతాల్లో వెంటనే కౌంటింగ్ ప్రారంభించి.. ఫలితాలను విడుదల చేస్తున్నారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు(Electoral votes) ఉండగా.. ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) 210 ఎలక్టోరల్ ఓట్లు కైవసం చేసుకున్నారు. అలాగే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్(Kamala Harris) 122 ఎలక్టోరల్ స్థానాలు కైవసం చేసుకొని అధ్యక్ష రేసులో వెనుకబడి ఉన్నారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకు గాను 270 సాధించిన వారు అమెరికా అధ్యక్ష పీఠం కైవసం చేసుకుంటారు. తాజాగా వెలువడుతున్న ఫలితాల సరలి ప్రాకారం.. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా అయ్యేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అధ్యక్ష రేసులో ఆయనకు ఇంకో 61 ఓట్లు వస్తే సరిపోతుంది. కాగా ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. మొత్తం 20 రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించగా.. కమలా హారీస్ 10 రాష్ట్రాల్లో విజయం సాధించారు. కాగా పలు రాష్ట్రాల్లో ట్రంప్ హవా కొనసాగుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో కమలా హరీస్ దూసుకుపోతుంది. అలాగే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లుగా టఫ్ ఫైట్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News