Muda Scam: ముడా స్కాంలో సంచలన పరిణామం.. లోకాయుక్త విచారణకు హాజరైన సీఎం సిద్ధరాయమ్య

ముడా స్కాం (Muda Scam)లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.

Update: 2024-11-06 05:25 GMT
Muda Scam: ముడా స్కాంలో సంచలన పరిణామం.. లోకాయుక్త విచారణకు హాజరైన సీఎం సిద్ధరాయమ్య
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ముడా స్కాం (Muda Scam)లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah)ను ఈ నెల 6న విచారణకు రావాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన మైసూర్‌లోని లోకాయుక్త (Lokayuktha) కార్యాలయానికి విచారణకు వెళ్లారు. ఇప్పటికే ఇదే కేసులో అక్టోబర్ 25న సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) సతీమణి పార్వతితో పాటు ఆమె సోదరుడు మల్లికార్జున స్వామి (Mallikarjuna Swamy), దేవరాజు (Devaraju)ను లోకాయుక్త విచారించింది. అదేవిధంగా ముడా (Muda) భూ కుంభకోణంలో మనీ ల్యాండరింగ్‌కు సంబంధించి ఈడీ (Enforcement Directorate) కూడా విచారణను వేగవంతం చేసింది. మాజీ కమిషనర్ డీబీ నటేశ్‌ (DB Natesh)ను అధికారులు ప్రశ్నించి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

కాగా, మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (MUDA)కి చెందిన 3.2 ఎకరాల భూమి విషయంలో అసలు వివాదం తలెత్తింది. సీఎం సతీమణి పార్వతి (Parvati)కి 2010లో ఆమె సోదరుడు మల్లికార్జున స్వామి కేసరే అనే గ్రామంలో 3.2 ఎకరాల భూమిని గిఫ్ట్‌గా ఇచ్చారు. అయితే, ఓ ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణలో భాగంగా ముడా ఆ భూమిని స్వాధీనం చేసుకుంది. భూమని కోల్పోయిన తమకు పరిహారం ఇవ్వాలంటూ పార్వతి డిమాండ్ చేసింది. దంతో ముడా ఆమెకు సౌత్ మైసూర్‌లోని విజయనగర్‌లో 14 ప్లాట్లను కేటాయించింది. అయితే, ప్రస్తుతం ఆ ప్లాట్ల ధర వాళ్లు ఇచ్చిన ల్యాండ్ వాల్యూ కంటే చాలా ఎక్కువని ఆరోపణలు వెల్లువెత్తాయి. 

Tags:    

Similar News