ఎల్‌కే అద్వానీని కలిసి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోడీ

ఎన్డీయే కూటమి నేతగా ఎన్నికైన నేపథ్యంలో మోడీ స్వయంగా అద్వానీ నివాసానికి వెళ్లి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు

Update: 2024-06-07 10:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఎర్పాటు చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం బీజేపీ సీనియర్ నేత, భారతరత్న ఎల్‌కే అద్వానీని గౌరవపూర్వకంగా కలిశారు. ఎన్డీయే కూటమి నేతగా ఎన్నికైన నేపథ్యంలో మోడీ స్వయంగా అద్వానీ నివాసానికి వెళ్లి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆ తర్వాత మరో బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషిని కూడా మోడీ ఆయన ఇంటివద్ద కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇద్దరు సీనియర్ నేతలను తన ప్రమాణస్వీకారానికి రావాలని మోడీ ఆహ్వానించారు. అనంతరం ప్రధాని మోడీ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను సైతం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి రామ్‌నాథ్‌ కోవింద్‌ మిఠాయి తినిపించారు. వారు ఇరువురు కాసేపు ముచ్చటించారు. అంతకుముందు పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీలన్నీ ఏకగ్రీవంగా తమ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నరేంద్ర మోడీని ఎన్నుకున్నాయి. ఈ క్రమంలొనే టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ చీఫ్‌ నితీశ్‌కుమార్ మోడీకి తమ మద్దతు ప్రకటించారు.  


Similar News