జీ20 పార్లమెంట్ స్పీకర్స్ సమ్మిట్..

Update: 2023-10-06 16:58 GMT

న్యూఢిల్లీ : 9వ జీ20 పార్లమెంట్ స్పీకర్స్ సదస్సును (పీ20) ఈ నెల 9న భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అక్టోబర్ 12 నుంచి 14 వరకు ద్వారకలోని యశభూమి వద్ద ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ (IICC)లో ఈ సమ్మిట్‌ జరగనుంది. ఈ మేరకు శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. జీ20 దేశాలతో పాటు 10 ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఈ సదస్సులో పాల్గొంటాయని తెలిపారు.

ఇప్పటివరకు 50 మంది పార్లమెంటేరియన్లు, 14 మంది సెక్రటరీ జనరల్స్ సహా 26 మంది అధ్యక్షులు, 10 మంది ఉపాధ్యక్షులు, ఒక కమిటీ చైర్మన్, IPU ప్రెసిడెంట్ తమ భాగస్వామ్యాన్ని ధృవీకరించినట్లు వెల్లడించారు. ‘SDGలను వేగవంతం చేయడం, సస్టెయినబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి, పబ్లిక్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రజా జీవితాల్లో మార్పు’ అంశాలపై నాలుగు అత్యున్నత స్థాయి సమావేశాలు నిర్వహించబడతాయని బిర్లా తెలియజేశారు. పీ20 లక్ష్యాలను పార్లమెంట్లు ఎలా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లగలవు అనే అంశంపై విస్తృత చర్చల కోసం G-20 సభ్యులు, అతిథి దేశాలను ఈ సమావేశాలు ఒక్క చోట చేర్చుతాయని అన్నారు.


Similar News